Op Sindoor | ఆపరేషన్ సిందూర్‌పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మాజీ రాయబారి కేపీ ఫాబియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని, విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌పై ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ సందర్భంగా మాజీ దౌత్యవేత్త ఫాబియన్ మాట్లాడుతూ యుద్ధం మూడు నెలల కిందట ముగిసిందన్నారు. ఈ వివాదం పీవోకేను విముక్తి చేయడం కాదని.. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న మౌలిక సదుపాయాలపై సర్జికల్ దాడులు చేయడమే లక్ష్యమన్నారు. పాక్ వెళ్లి అమెరికా దగ్గర గోడు వెల్లబోసుకుందన్నారు. ట్రంప్‌ను ప్రధాని విమర్శించాలని కాంగ్రెస్ అంటోందని.. ఇది దౌత్యపరంగా సరైంది కాదన్నారు. ఓ ప్రభుత్వ అధిపతి.. మరో ప్రభుత్వ అధిపతిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేరన్నారు.
పాకిస్తాన్ డీజీఎంవో కాల్పుల విరమణ కోరిన సమయంలో.. దాన్ని పరిశీలిస్తున్నామని భారత్ ప్రకటన విడుదల చేసి ఉండవచ్చన్నారు. భారత నాయకత్వాన్ని సంప్రదించిన తర్వాత భారత డీజీఎంవో అవునని లేదంటే కాదని సమాధానం ఇచ్చి ఉండాలన్నారు. బెంగళూరులో జరిగిన 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే స్మారక ఉపన్యాసం సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఆరు విమానాలను కూల్చివేసినట్లు తెలిపారు. దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఈ విజయం భారత వైమానిక దళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, మన సైనికుల సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఎస్-400 రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ వంటిదని.. పాక్ యుద్ధ విమానాలు, మానవ రహిత విమానాలను ఈ వ్యవస్థ బలంగా ఎదుర్కొందని పేర్కొన్నారు. భారత ఎయిర్ స్పేస్‌లోకి పాక్ చొరబడే అవకాశం ఉండదన్నారు.