శబరిమల: శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న క్రమంలో కేరళ అటవీ శాఖ భక్తులకు ఒక విజ్ఞప్తి చేసింది. భక్తులు కొండ గుడి సమీపంలో ఉన్న ఉరకుళి జలపాతాలను సందర్శించవద్దని కోరింది.
అక్కడ తరచూ జరిగే ప్రమాదాలు, క్రూరమృగాల దాడుల నేపథ్యంలో ఈ హెచ్చరిక చేస్తున్నట్టు సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ అధికారి అరవింద్ బాలకృష్ణ తెలిపారు.