రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇంకా 15 వేల మంది భారతీయులు ఉక్రెయన్లో చిక్కుకున్నారని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్ వీ శ్రింగ్లా తెలిపారు. కీవ్‌లో ఉన్న భారత ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థుల వివరాలను వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందే 4 వేల మంది భారతీయులు ఉక్రెయన్ నుంచి వెళ్లిపోయారని.. ఇంకా 15 వేల మంది భారతీయులు ఉక్రెయన్లో చిక్కుకున్నారని హర్ష్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్స్‌ను తరలించేందుకు ఆపరేషన్ గంగాను భారత ప్రభుత్వం ప్రారంభించిందని.. దానిలో భాగంగా 1000 మంది భారతీయులను రొమానీ, హంగేరీ నుంచి భారత్‌కు తరలించామన్నారు. మరో వెయ్యి మందిని ఉక్రెయిన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మరో వెయ్యి మందిని భారత్‌కు పంపించామన్నారు. వాళ్ల కోసం విమానాలను ఏర్పాటు చేస్తున్నామని హర్ష్ వెల్లడించారు.
ఆపరేషన్ గంగలో భాగంగా భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే ఉంటుందిన హర్ష్ శ్రింగ్లా స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్‌ను మూసేయడం వల్ల హంగేరీ, పొలాండ్, స్లోవేకియా, రొమానియా వరకు భారతీయ విద్యార్థులను రోడ్డు మార్గం ద్వారా తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నామన్నారు.
భారతీయ విద్యార్థులు హంగేరీ, రొమానియా బార్డర్ వద్దకు చేరుకోవచ్చు. పొలాండ్ బార్డర్ మాత్రం లక్షల మంది విదేశీయులతో నిండిపోయింది. దీంతో అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను తరలించడం చాలా కష్టంగా మారుతోంది. రష్యా, ఉక్రెయిన్ అంబాసిడర్లతో మాట్లాడాం. భారత పౌరులు సేఫ్‌గా ఉండేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుతున్నాం. ఎక్కడెక్క భారత పౌరులు ఉన్నారో వాళ్ల వివరాలు, లొకేషన్లను రష్యా, ఉక్రెయిన్ అంబాసిడర్లకు వేర్వేరుగా పంపించాం. భారత పౌరులకు ఎటువంటి సమస్య రాకుండా.. భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తామని వాళ్లు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.