బలవంతపు మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దేశ భద్రతపై ప్రభావం: సుప్రీంకోర్టు
బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడి చాలా తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భద్రతపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలను కోరింది. వారంలోగా స్పందించి దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
బలవంతపు మతమార్పిడులను నేరంగా పరిగణించాలని ఢిల్లీ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేశారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని లేదా భారత శిక్షాస్మృతిలో ఈ నేరాన్ని చేర్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ సమస్య ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదని, దేశమంతా ఈ సమస్య ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరారు.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఆర్ షా, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ జరిపింది. ‘బలవంతపు మత మార్పిడి చాలా తీవ్రమైన సమస్య. ఇది అంతిమంగా దేశ భద్రతతోపాటు పౌరుల మనస్సాక్షి, మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించింది. బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బలవంతపు మతమార్పిడుల నిరోధానికి ఎలాంటి చర్యలు ప్రతిపాదిస్తారో చెప్పాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

