న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల 21వ వార్షిక జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో తమ తమ రంగాల్లో విశేష ప్రతిభను చూపిన ముగ్గురు భారతీయ మహిళలకు స్థానం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (28వ ర్యాంక్), హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో రోషిణీ నాడార్ మల్హోత్రా (81వ ర్యాంక్), భారత్లో వ్యక్తిగతంగా అత్యంత సంపన్నురాలిగా నిలిచిన కిరణ్ మజుందార్ షా (91వ ర్యాంక్)లు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం, వినోదం, రాజకీయాలు, దాతృత్వం, విధాన రూపకల్పన ఇలా పలు రంగాలలో తమ ప్రతిభతో ప్రభావవంతంగా నిలిచిన మహిళలను ప్రతి ఏడాది ఎన్నిక చేసి ఫోర్బ్స్ జాబితా విడుదల చేస్తుంది.