Maharashtra | ముంబై, అక్టోబర్ 27( నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారి తండ్రి కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. అహేరి నియోజకవర్గంలో తండ్రి, కుమార్తె పోటీ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్సీపీ (అజిత్ పవార్) తరఫున తండ్రి ధర్మారావు బాబా ఆత్రమ్, ఎన్సీపీ (శరద్ పవార్) తరఫున కుమార్తె భాగ్యశ్రీ బరిలో నిలబడ్డారు. 72 ఏండ్ల తన తండ్రి ఎక్కడికీ కదలలేరని, ప్రజలకేం చేస్తారని కుమార్తె ప్రశ్నిస్తున్నారు. తన కూతురికి వంట రాదని, అల్లుడు నిత్యం జొమాటో నుంచి అన్నం తెప్పించుకుని తింటాడని.. అలాంటిది ప్రజలకు ఏం చేస్తుందని మంత్రి ధర్మారావు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.