శ్రీనగర్: జమ్ము కశ్మీర్ శాసన సభ ఎన్నికల్లో రికార్డులు నమోదవడం ప్రారంభమైంది. మూడు దశాబ్దాల్లో తొలిసారి ఓ కశ్మీరీ పండిట్ మహిళ డైజీ రైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవారు. ఆమె పుల్వామాలోని ఫ్రీసల్ గ్రామ సర్పంచ్ కూడా. ఆమె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరపున బరిలో నిలిచారు. ఈ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి. రాజ్‌పొర శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డైజీ రైనా మాట్లాడుతూ, యువత తమ గళంగా నిలవాలని తనను కోరారని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను సర్పంచ్‌గా పని చేస్తున్నానని, యువతను కలుస్తూ, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ఉంటానన్నారు.