బెంగళూరు: ఒక మహిళను లైంగికంగా వేధించిన కాంగ్రెస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ నేత మనోజ్ కర్జగికి చెందిన సెలూన్లో ఒక మహిళ బ్యూటీషియన్‌గా పని చేస్తున్నది. శనివారం ఆయన ఆ సెలూన్‌కు వెళ్లాడు. మహిళా ఉద్యోగినిని హత్తుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసింది. దీంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చిన అతడు కాంగ్రెస్ నేత మనోజ్‌ను కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలపై మనోజ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
కాగా, ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మనోజ్ కర్జగి, మాజీ మంత్రి అనుచరుడని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయువ్య కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ డైరెక్టర్‌గా మనోజ్ కర్జగి ఉన్నాడు. దీంతో మాజీ సీఎం సిద్ధరామయ్యతో ఆయన కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.