కోల్‌కతా: ఆక్రమణలు తొలగించిన మహిళా అధికారిణిని మంత్రి బెదిరించారు. పేదల షాపులు తొలగింపుపై ఆమెను దుర్భాషలాడారు. (Minister Threatens Woman Official) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మేదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తాజ్‌పూర్‌లోని సముద్ర తీరానికి సమీపంలోని అటవీ శాఖ భూమిలో కొన్ని షాపులను అక్రమంగా ఏర్పాటు చేశారు. సముద్రానికి చాలా దగ్గరగా, ప్రమాదకర స్థితిలో ఉన్న అక్రమ షాపులను శుక్రవారం రాత్రి తొలగించారు.
కాగా, ఆ వ్యాపారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మంత్రి అఖిల్ గిరి, శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ షాపులను తొలగించడంపై మహిళా ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా అక్రమ నిర్మాణాలను వదిలేసి పేదలకు చెందిన షాపులను మాత్రమే తొలగించారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా అధికారిణిని దుర్భాషలాడటంతోపాటు బెదిరించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగాల్ బీజేపీ దీనిని ఎక్స్‌లో షేర్ చేసింది. మహిళా అధికారిణిని తిట్టడంతోపాటు బెదిరించిన మంత్రి అఖిల్ గిరిపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించింది. ఆయనను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేసింది.
West Bengal Minister Akhil Giri threatens a lady Forest Officer because she was performing her duty to remove illegal encroachment in forest areas.
What did he say –
1. "সরকারি কর্মচারী, মাথা নিচু করে কথা বলবেন।" – You are a government employee, bow down your head (infront of… pic.twitter.com/CDrULP9Mli
— BJP West Bengal (@BJP4Bengal) August 3, 2024