లక్నో, ఏప్రిల్ 27: ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడంలో జాప్యం చేసినందుకు ఓ అధికారికి యూపీ సమాచార కమిషన్ వినూత్న శిక్ష విధించింది. ఘాజీపూర్‌లోని 250 మంది విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఆదేశించింది.
ఘాజీపూర్ జిల్లా నూన్ర గ్రామంలో అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాల్సిందిగా ఆర్టీఐ కార్యకర్త భూపేంద్ర కుమార్ పాండే దరఖాస్తు చేసుకున్నారు. అయితే గ్రామ అభివృద్ధి అధికారి, నూన్ర గ్రామ పీఐవో చంద్రిక ప్రసాద్ 30 రోజుల్లో స్పందించలేదు. దీంతో ఏప్రిల్ 29న పిల్లలకు భోజనం వడ్డించాలని చంద్రికను సమాచార కమిషనర్ అజయ్ కుమార్ ఆదేశించారు.