BJP Candidate Arrested | ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ అభ్యర్థి.. అరెస్ట్ చేసిన పోలీసులు
BJP Candidate Arrested | ఓటు వేసే సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆ అభ్యర్థిపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
భువనేశ్వర్: ఓటు వేసే సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడు. (BJP Candidate Arrested) దీంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆ అభ్యర్థిపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిలికా బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. బెగునియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కౌన్రిపట్నలో ఓటరుగా ఆయన ఉన్నారు.
కాగా, శనివారం ఆరో దశ పోలింగ్ సందర్భంగా ప్రశాంత్ జగ్దేవ్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ఈవీఎం మోరాయించడంతో ఓటు వేసేందుకు కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, ఆయన మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ప్రశాంత్, టేబుల్‌పై ఉన్న ఈవీఎంను లాగడంతో అది కిందపడి పగిలింది. దీంతో పోలింగ్‌కు విఘాతం కలిగింది.
మరోవైపు ఈవీఎంను ధ్వంసం చేసిన బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ జగ్దేవ్పై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఖుర్దా జైలుకు ఆయనను తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Bjp Candidate
- evm
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

