న్యూఢిల్లీ : యూకే ఫుడ్ ఛానెల్ చికెన్ కుర్మా వంటకం వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రైస్, కిస్మిస్లు, పాలకూరతో వంటిన చికెన్ కుర్మా వీడియోను చూసి దేశీ నెటిజన్లు ఇదేం రెసిపీ అంటూ నొసలు చిట్లించారు. టేస్టీ యూకే అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
One-Pot Chicken Korma 😍 pic.twitter.com/pQDerTbyZX
— Tasty UK (@TastyUK) December 3, 2022
వన్ పాట్ చికెన్ కుర్మా క్యాప్షన్‌తో ఈ క్లిప్‌నకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ డిష్ కోసం ప్యాన్‌లో ఆయిల్ వేసి ఉల్లి, వెల్లుల్లిని వేయించారు. ఆపై చికెన్ ముక్కలు, టొమాటోలను కుర్మా పేస్ట్‌తో కలిపి బాస్మతి రైస్‌తో ఉడికించారు. ఆపై నీరు, కిస్మిస్లు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత రెసిపీకి పాలకూర, పైన్ నట్స్, పెరుగు, కొత్తిమీర జోడించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల మంది పైగా వీక్షించారు. ఈ రెసిపీపై దేశీ నెటిజన్లు విరుచుకుపడ్డారు. అసలు ఇదేం డిష్ అంటూ మండిపడ్డారు. అసలు మీ టీంలో ఎవరికైనా కుకింగ్ వచ్చా అంటూ ఓ యూజర్ ఆడుకున్నారు. ఇదేం అరాచకం అంటూ మరో యూజర్ కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.