బక్సర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటనను పురస్కరించుకుని అధికారులు ఏర్పాటు చేసిన వందలాది పూలకుండీలను ప్రజలు చోరీ చేశారు. ఈ వింత ఘటన బక్సర్‌లో శనివారం చోటు చేసుకుంది. తన ప్రగతి యాత్రలో భాగంగా నితీశ్ కుమార్ శనివారం బక్సర్ జిల్లా కేంద్రాన్ని సందర్శించి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
సీఎంకు స్వాగతం పలికేందుకు జిల్లా అతిథిగృహం వెలుపల రోడ్డుపైన వందలాది పూల కుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. సీఎం అక్కడి నుంచి బయల్దేరిన మరుక్షణం పెద్ద సంఖ్యలో స్థానికులు పూల కుండీలను తీసుకుని ఉడాయించారు.