Flipkart Big Billion Days sale : సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌పై గ్రేట్ డీల్స్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఐఫోన్ 15 ధర ప్రస్తుతం రూ. 69,900 కాగా, ఈ ధరను ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గణనీయంగా తగ్గించేందుకు కసరత్తు సాగిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్ సహా అన్ని స్మార్ట్ఫోన్లపై గ్రేట్ డీల్స్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
అయితే ఈ ఫోన్లపై ఎంతమేర డిస్కౌంట్లు ఉంటాయనే వివరాలను వెబ్సైట్ ఇప్పటివరకూ స్పష్టం చేయలేదు. దీనిపై సెప్టెంబర్ 23న మరిన్ని వివరాలు తెలుస్తాయని డిస్కౌంట్ ధరలను ఈ-కామర్స్ దిగ్గజం అదేరోజు వెల్లడించనుంది. గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ ఈ సేల్‌లో మెరుగైన ధరలో లభిస్తుందని చెబుతున్నారు. ప్రొ మోడల్స్ బడ్జెట్ అనుకూలించేవారు గత ఏడాది ఐఫోన్ మోడల్‌ను సొంతం చేసుకోవడం బ్యాడ్ ఐడియా కాబోదని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఐఫోన్ 16 తరహాలోనే ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ వంటి మోడల్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ను పొందుతాయి.
యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ సైతం 15 ప్రో మోడల్స్‌లో అందుబాటులోకి రానుంది. మరోవైపు ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ ఉత్పత్తి కూడా నిలిపివేసినందున మిగిలిన డివైజ్‌లను అందుబాటు ధరలో వినియోగదారులు సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. ఐఫోన్ 15 సిరీస్ ఏ16 బయోనిక్ చిప్సెట్తో మల్టీ టాస్కింగ్, ఇన్స్టంట్ యాప్ లోడ్ వంటి ఫీచర్లను కలిగింది. ఐఫోన్లతో అద్భుత వీడియో రికార్డింగ్ సౌకర్యంతో పాటు మీరు ఓ మొబైల్ గేమర్ లేదా క్రియేటర్ అయితే ఐఫోన్ 15 సిరీస్ ప్రాసెసింగ్ పవర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఐఫోన్ 16 సిరీస్ లేటెస్ట్ 18 చిప్సెట్తో కస్టమర్ల ముందుకొచ్చింది.
Read More :
KTR | 10 వేల కోట్ల అప్పు కోసం.. ఐటీ పరిశ్రమకు కేటాయించిన 400 ఎకరాలు తాకట్టుకు!: కేటీఆర్