న్యూఢిల్లీ: పుణెలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీయే)లో శిక్షణ పొందిన తొలి మహిళగా ఫ్లైట్ క్యాడెట్ దివ్యాన్షీ సింగ్ రికార్డ్ సృష్టించారు. ఆమె త్వరలో భారత వైమానిక దళంలో గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్లో అధికారిణిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్డీయే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్డీయే అకాడమీలో 2022లో ప్రవేశం పొందిన తొలి అయిదుగురు మహిళా క్యాడెట్లలో దివ్యాన్షీ ఒకరు. మొదటి మహిళా క్యాడెట్ల బ్యాచ్ నిరుడు మార్చిలో ఎన్డీయే శిక్షణ పూర్తి చేసుకుంది.