Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 13: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఐదేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన ఓ కిరాతకుడు, ఆ పసిపాపై లైంగికదాడికి ప్రయత్నించటమేగాక, అత్యంత కర్కశకంగా గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పోలీసులు నిందితుడ్ని గుర్తించారు.
అతడిని పట్టుకునే ప్రయత్నంలో, పోలీసు కాల్పులు జరుపగా నిందితుడు హతమయ్యాడు. నిందితుడు రితేశ్ కుమార్ బీహార్‌లోని పాట్నాకు చెందినవాడిగా పోలీసులు వెల్లడించారు. హుబ్బిళిలోని అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, పనిమనిషి 5 ఏండ్ల కూతురుపై రితేశ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. బాలిక అరుపులతో గొంతు నులిమి పారిపోయాడు.