న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఐదుగురు కొత్త న్యాయమూర్తుల చేత మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
జస్టిస్‌లు శీల్ నాగు, శ్రీ చంద్రశేఖర్, సంజీవ్ సచ్దేవ, అరుణ్ పల్లి, వి మోహన సుప్రీం కోర్ట్ జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 37కి చేరుకుంది. ఈ సంఖ్య దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేటాయించిన మొత్తం జడ్జిల సంఖ్య కంటే ఒకటి తక్కువ.