Asias Best Restaurants : ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బెస్ట్ రెస్టారెంట్స్‌కు ర్యాంకింగ్స్ ప్రకటించే బ్రిటన్‌కు చెందిన విలియం రీడ్ బిజినెస్ మీడియా ఇటీవల మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో 50 బెస్ట్ రెస్టారెంట్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాకు కొనసాగింపుగా ఈ ఏడాది 51 నుంచి 100 ర్యాంకింగ్స్ సాధించిన ఆసియా రెస్టారెంట్స్‌ను వెల్లడించింది.
ఈ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన ఐదు రెస్టారెంట్లు బెస్ట్ రెస్టారెంట్స్ ర్యాంకింగ్స్‌ను దక్కించుకున్నాయి. ఇందులో ముంబైకి చెందిన అమెరికానో (61వ ర్యాంక్), ది బాంబే క్యాంటిన్ (70), ఏకా (98) ర్యాంక్‌ను సాధించాయి. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురుగ్రాంకు చెందిన కమోరిన్ (79), ఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87వ ర్యాంక్) బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇక ఈ జాబితాలో టోక్యోకు చెందిన ఎల్ ఎఫెర్వెసిన్ టాప్ స్లాట్‌లో నిలిచింది. 51-100 బెస్ట్ రెస్టారెంట్స్ లిస్ట్‌లో సింగపూర్, టోక్యో నగరాల నుంచి ఆరేసి చొప్పున రెస్టారెంట్టు ముందువరసలో నిలిచాయి.
Read More :
AAP: పంజాబ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ