AN-32 Transport Aircraft : ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో అయిదుగురు సిబ్బంది మృతి
AN-32 Transport Aircraft : అస్సాంలోని జోర్హట్లో ఇవాళ ఏఎన్-32 ట్రాన్స్‌పోర్టు విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అయిదుగురు సిబ్బంది మృతిచెందినట్లు ఇవాళ భారతీయ వైమానిక దళం ప్రకటించింది. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సర్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్వాయు కేమరం కుమావ్, అగ్నివీర్వాయు డానిష్ ఆలమ్ ఉన్నారు.
గౌహతి: అస్సాంలోని జోర్హట్లో ఇవాళ ఏఎన్-32 ట్రాన్స్‌పోర్టు విమానం(AN-32 Transport Aircraft) కూలిన విషయం తెలిసిందే. ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆ విమానం కూలింది. ఈ ఘటనలో అయిదుగురు సిబ్బంది మృతిచెందినట్లు ఇవాళ భారతీయ వైమానిక దళం ప్రకటించింది. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సర్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్వాయు కేమరం కుమావ్, అగ్నివీర్వాయు డానిష్ ఆలమ్ ఉన్నారు. విధి నిర్వహణలో తమ సిబ్బంది వీరమరణం పొందినట్లు ఐఏఎఫ్ తన ప్రకటనలో పేర్కొన్నది.
ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన కో-పైలట్ ప్రాణాలతో ఉన్నాడు. అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై తేల్చేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వైమానిక దళం పేర్కొన్నది. రోటీన్ సోర్టీలో భాగంగా ఏఎన్-32 ఎగిరిందని, సుమారు 10 గంటల సమయంలో జోర్హట్ వద్ద ప్రమాదం జరిగినట్లు వైమానిక దళం తన ఎక్స్ అకౌంట్లో తెలిపింది. క్రాష్ సైట్ మేనేజ్మెంట్, ప్రాథమిక ఎంక్వైరీలు చేస్తున్నారు.
ప్రాథమిక సమాచారం వచ్చే వరకు ప్రతి ఒక్కరు ఈ దాడుల గురించి చర్చించవద్దు అని ఐఏఎఫ్ తెలిపింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఐఏఎఫ్ సానుభూతి ప్రకటించింది. రన్‌వే మీద కాకుండా ఎయిర్‌స్ట్రిప్ పక్కన విమానం దిగింది.
The Indian Air Force deeply regrets the loss of five personnel in the An-32 accident at Jorhat, Assam.
Sqn Ldr Prashant Singh, Flt Lt Shubham Kumar, Sgt Jitendra Sharma, Agniveervayu Khemaram Kumawat and Agniveervayu Danish Alam made the supreme sacrifice in the line of duty.… pic.twitter.com/9SmOjtS5mU
— Indian Air Force (@IAF_MCC) June 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

