ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లో ఊపిరాడక ఐదుగురు దుర్మరణం.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలందరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. ఓ కార్మికుడు చెత్త సేకరణ ట్యాంక్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడని కమిషనర్ తెలిపారు. అతన్ని కాపాడేందుకు మరో ఏడుగురు ట్యాంక్‌లోకి వెళ్లగా స్పృహ తప్పి పడిపోయారన్నారు.
వారందరినీ ఏజే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి ముగ్గురు మృతి చెందారని, ఇవాళ ఉదయం మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని, వారి వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఐసీయూలో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ఘటనలో మేనేజర్, సూపర్వైజర్పై సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ రూబీ జోసెఫ్, ఫీల్డ్ మేనేజర్ కుబేర్ గాడే, సూపర్వైజర్లు మహ్మద్ అన్వర్, ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

