భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విశాఖపట్నం
INS Visakhapatnam: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో

అమరావతి: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు. ఈ సదర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ నౌకలు, జలాంతర్గాముల తయారీలో భారత్ ముందంజలో ఉన్నదన్నారు.
ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలు
ఈ యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలురకాల క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికలను శత్రుదేశాల రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. అదేవిధంగా ఇందులో రెండు మల్టీరోల్ హెలికాప్టర్లు ఉంటాయి. నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రలో విశాఖలోని డాల్ఫిన్నోస్ కొండ, దానిపై ఉండే దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణజింక ముఖ భాగాన్నిఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని ఎంచుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

