Lok Sabha Session | నేటి నుంచి లోక్‌సభ సమావేశాలు.. 26న కొత్త స్పీకర్ ఎన్నిక
18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
- తొలి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం
- 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
- ప్రొటెం స్పీకర్ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం
Lok Sabha Session | న్యూఢిల్లీ, జూన్ 23: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన భర్తృహరి మహతాబ్ చేత ప్రమాణం చేయించనున్నారు. . కాగా, ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
దళితుడైనందువల్లే బీజేపీ వివక్ష!
ప్రొటెం స్పీకర్ అంశంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య వివాదం కొనసాగుతున్నది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తృహరి కంటే కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ సీనియర్ అని, దళితుడైనందు వల్లే సురేశ్‌కు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్ అలా కాలేదని చెప్పారు. సురేశ్ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ అంశం లోక్‌సభ సమావేశాల్లో హాట్ టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

