చెన్నై, ఆగస్టు 24: భారత్‌లో తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ‘రుమీ-2024’ను తమిళనాడు స్టార్టప్ కంపెనీ ‘స్పేస్ జోన్ ఇండియా’ శనివారం ప్రయోగించింది. రాకెట్ 80 కిలోల బరువు, 3.5 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రపంచంలో హైడ్రాలిక్ మొబైల్ కంటెయినర్ లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించిన తొలి హైబ్రిడ్ రాకెట్ ఇదేనని స్పేస్ జోన్ ఇండియా సీఈవో ఆనంద్ చెప్పారు.
కిలో కంటే తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలతోపాటు 50 పికో ఉపగ్రహాలను భూ ఉప కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితులతోపాటు కాస్మిక్ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలి నాణ్యత తదితర అంశాల వివరాలను క్యూబ్ ఉపగ్రహాలు సేకరిస్తాయని, నింగిలో కంపన స్థాయిలతోపాటు ఓజోన్ పొర స్థితిగతులను పికో ఉపగ్రహాలు గుర్తిస్తాయని వివరించారు. ఉపగ్రహాలను జారవిడిచిన తర్వాత పారాచ్యూట్ సాయం తో ‘రుమీ’ సముద్రంలో పడిపోయిందని తెలిపారు.