వడోదర: గుజరాత్‌లోని వడోదరలో నిర్మించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాంగణాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సోమవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమలో సీ295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేస్తారు. ఇవి భారత్‌లో తొలి ప్రైవేట్ మిలిటరీ విమానాలు. ఈ ఎయిర్‌బస్ సీ295 మధ్య శ్రేణి సైనిక రవాణా విమానాలను ప్రారంభంలో స్పెయిన్ సంస్థ కాసా డిజైన్ చేసి రూపొందిస్తుంది. సీ295 కార్యక్రమం కింద 56 విమానాలను స్పెయిన్ కంపెనీ ఎయిర్ బస్ స్పెయిన్‌లో తయారు చేస్తుంది. మిగిలిన 40 విమానాలను భారత్‌లోని టాటా సంస్థ తయారు చేస్తుంది.