ఈశాన్య రాష్ట్రాలకూ ఒమిక్రాన్ వ్యాప్తి.. మణిపూర్‌లో తొలి కేసు

ఇంఫాల్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపించింది. మణిపూర్‌లో తొలి కేసును గుర్తించారు. ఈ నెల 13న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఇంఫాల్‌లోని ఐసొలేషన్ కేంద్రంలో అతడు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ కే రాజో సింగ్ వెల్లడించారు. విదేశాల నుంచి మణిపూర్‌కు వచ్చిన 480 మంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 174 మంది 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నారని, మరోసారి నిర్వహించిన కరోనా పరీక్షలో కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. మిగతా 306 మంది అబ్జర్వేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు మణిపూర్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.39 శాతంగా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

