ఈ20తో కారు ఇంజిన్ డ్యామేజ్.. కొత్త కారు ఇవ్వండి లేదా పెనాల్టీతో డబ్బు వాపస్ చేయండి
దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్(20%) ఇథనాల్ కలిపిన ఇంధనం వినియోగంపై విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ20 వినియోగానికి సంబంధించిన వాహన వివాదంపై దేశంలోనే మొట్టమొదటి కీలక తీర్పును రాయ్‌పూర్‌లోని ఒక వినియోగదారుల కోర్టు వెలువరించింది.
- మారుతి సుజుకీకి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశం
- ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఘటన
- ఈ20తో వాహన ఇంజిన్ చెడిపోయిన కేసులో తొలి తీర్పు
న్యూఢిల్లీ, జూలై 16 : దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్(20%) ఇథనాల్ కలిపిన ఇంధనం వినియోగంపై విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ20 వినియోగానికి సంబంధించిన వాహన వివాదంపై దేశంలోనే మొట్టమొదటి కీలక తీర్పును రాయ్‌పూర్‌లోని ఒక వినియోగదారుల కోర్టు వెలువరించింది. ఈ20 ఇంధనం కారణంగా పదేపదే ఇంజిన్ సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు రావడంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, దాని అధీకృత డీలర్‌ను బాధ్యులుగా జిల్లా వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ తేల్చింది. ఈ వాహనానికి చెందిన ఇంజిన్ ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేనప్పటికీ ఆ కారును వినియోగదారుడికి విక్రయించారని కమిషన్ తీర్పునిచ్చింది. 45 రోజుల్లోగా అదే మోడల్‌కు చెందిన కొత్త ఈ20 అనుకూల వాహనాన్ని అందించాలని, లేదా అదనపు పరిహారంతోపాటు వాహన కొనుగోలు ధర అయిన రూ. 20.5 లక్షలను పూర్తిగా వాపసు చెల్లించాలని ఆ సంస్థను కమిషన్ ఆదేశించింది.
కేసు నేపథ్యం
ప్రేమ్‌రాజ్ దేబ్తా 2024 జూన్ 3న మారుతీ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. సుమారు ఐదు నెలల తర్వాత నవంబర్ 11న ఆ వాహనంలో మొదటిసారిగా సాంకేతిక లోపం తలెత్తి అది పదేపదే ఆగిపోవడం మొదలైంది. కంపెనీ వర్క్‌షాప్ మొదట ఈ సమస్యకు కలుషితమైన ఇంధనమే కారణమని భావించి ఇంధన ట్యాంక్‌ను శుభ్రం చేసి వాహనాన్ని వినియోగదారునికి తిరిగి అప్పగించింది. పదేపదే మరమ్మతులు చేసినప్పటికీ సమస్యలు మాత్రం కొనసాగాయి. రెండవసారి వర్క్‌షాప్‌ను సందర్శించినపుడు టెక్నీషియన్లు ఇంధన ట్యాంక్ లోపల తెల్లటి జెల్లీ లాంటి పదార్థాన్ని కనుగొన్నారు.
మొదటి మరమ్మతు సమయంలో ట్యాంక్‌ను సరిగ్గా శుభ్రం చేయలేదని, రసాయనికంగా కలుషితమైన ఇంధన అవశేషాలు లోపల మిగిలిపోయాయని కంపెనీ అంగీకరించింది. మళ్లీ వెంటనే మూడవసారి వర్క్‌షాప్‌ని సందర్శించినపుడు ఇంధన ట్యాంక్, ఇంధన పైపులు, ఇంధన ఫిల్టర్లలో మళ్లీ తెల్లని నిక్షేపాలు, అవశేషాలు కనిపించాయి. ఆ తర్వాత నాలుగవ సందర్శనలో డాష్‌బోర్డ్ ఇంజిన్ లోపానికి సంబంధించిన హెచ్చరికను చూపించింది. వాహనం ఈవీ మోడ్ పనిచేయడం ఆగిపోయింది. ఐదవ సందర్శనలో ఇంజిన్ పూర్తిగా చెడిపోవడంతోపాటు వాహనం వినియోగానికి పనికిరాకుండా పోయింది. పదేపదే వైఫల్యాలు ఎదురుకావడంతో వినియోగదారుడు కమిషన్‌ను ఆశ్రయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

