బార్బీ బొమ్మను ఇష్టపడని చిన్నారులుండరు. ఆ బొమ్మను సొంతం చేసుకున్నప్పుడు ప్రపంచాన్నే జయించినట్లు వాళ్లు ఫీలవుతారు. అయితే, ఇప్పటిదాకా మనం వెస్ట్రన్ బార్బీలనే చూశాం. కానీ, ఇప్పుడు ఇండియన్ బార్బీ మార్కెట్లోకి రాబోతుంది. ఝుంకాలు, బ్యాంగిల్స్ ధరించిన బార్బీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఇండియన్ బార్బీకి యూట్యూబర్, బ్యూటీ బ్రాండ్ సీఈవో దీపికా ముత్యాల ప్రేరణగా నిలిచారు. బార్బీ తయారీ కంపెనీ మాట్టెల్తో కలిసి బ్రౌన్ స్కిన్ మేకప్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో దీపికా బాగా ప్రసిద్ధి చెందారు. దీపికా ముత్యాల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ ఇండియన్ బార్బీ ఫొటోలను షేర్చేశారు. ఈ ఇండియన్ బార్బీ ప్రియాంక చోప్రా జోనాస్లా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.