పాట్నా: బీహార్‌లోని మధేపుర జిల్లా ముర్లిగాంగ్లో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇద్దరు నేతల మధ్య జరిగిన వాగ్వివాదం కాల్పులకు దారితీసింది. స్థానిక నేత పంకజ్‌కుమార్ పటేల్.. సంజయ్‌కుమార్ భగత్ అనే మరో నేతపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. గాయపడిన భగత్‌ను దవాఖానకు తరలించారు. ఆర్థికపరమైన వివాదమే ఇద్దరి మధ్య ఘర్షణకు కారణంగా తెలుస్తున్నది. కాల్పుల ఘటన అనంతరం పార్టీలోని రెండు గ్రూపులు బాహాబాహీకి దిగాయి.