ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో కాలువలపై ఉన్న అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో అనేక మంది చిక్కుకుపోయారు. సహాయం కోసం ఖార్ఘర్ అగ్నిమాపక కేంద్రానికి పలువురు ఫోన్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది నవీ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడారు. భారీగా ప్రవహిస్తున్న కాలువలపై నిచ్చెనలు వేసి తాళ్ల సహాయంతో వందల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వర్షాల వల్ల చిక్కుకున్న 120 మందిని రక్షించామని, వారిలో 78 మంది మహిళలు ఉన్నారని ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ బోడ్ఖే తెలిపారు.
#WATCH | Maharashtra: Fire team rescued several people stranded in different parts of Navi Mumbai due to heavy rainfall.
— ANI (@ANI) July 19, 2021
"Kharghar fire station received calls from many people seeking help. We've rescued 120 people, out of which 78 were women," said Pravin Bodkhe, Fire Officer pic.twitter.com/YRF292N8df