కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం
chemical company | మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి.
ముంబై: మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో (chemical company) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. క్రమంగా అవి రసాయన పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంగటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 30 ఫైరింజన్లతో కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా, ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ హాని జరగలేదని చెప్పారు. రూ.కోట్లలో ఆస్తినష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన కంపెనీ సమీపంలో మరో ఏడు రసాయన పరిశ్రమలు ఉన్నాయని, అదృష్టవశాత్తు వాటికి మంటలు వ్యాపించలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

