Fire Breaks Out : యూపీలోని మీరట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎలాంటి మరణాలు వెలుగుచూడకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పర్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగిన సమాచారంతో ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలను తరలించిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు, దీనికి దారితీసిన పరిస్ధితులపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
Read More :
Brain chip | మెదడుతో మౌస్ కంట్రోల్.. న్యూరాలింక్ ప్రయోగంలో సానుకూల ఫలితం..!