Fire accident : ఎలక్ట్రానిక్ పరికరాలు తయారయ్యే ఓ కంపెనీ (Electronics company) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. దాంతో ఆ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని కచ్ జిల్లా (Kutch district) లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. గాంధీధామ్ మున్సిపాలిటీ, అంజార్ మున్సిపాలిటీ, కాండ్లా టింబర్ అసోసియేషన్లకు చెందిన ఎనిమిది ఫైరింజన్ల సాయంతో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా, ఎవరికైనా గాయాలయ్యాయా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat: A massive fire breaks out at an electronic gadgets manufacturing company in Kutch. 8 fire tenders from Gandhidham Municipality, Anjar Municipality and Kandla Timber Association present at the spot for firefighting operations. No casualties/injuries reported. pic.twitter.com/cfADAmVQxN
— ANI (@ANI) September 10, 2024