చండీగఢ్, అక్టోబర్ 15: హర్యానాలో పోలీస్ అధికారుల ఆత్మహత్యల కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా, డీజీపీపై కేసు నమోదు చేయగా, ఎస్పీని బదిలీ చేశారు.
కాగా, అదే కేసుకు సంబంధించి మంగళవారం ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. దీంతో పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అవ్నీత్ పీ కుమార్, గన్‌మేన్ సుశీల్, బత్తిండ రూరల్ ఎమ్మెల్యే అమిత్ రత్న, మరో వ్యక్తిపై రోహ్తక్ సదర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.