ముంబై: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ఫ్రీక్వెన్సీని ఐసొలేట్ చేయడం ద్వారా ఆ యంత్రాన్ని హ్యాక్ చేస్తానని చెప్పిన సయ్యద్ షుజపై ఎన్నికల సంఘం (ఈసీ) ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ చెప్తున్న మాటలు తప్పు, నిరాధారం అని ఫిర్యాదులో సీఈఓ పేర్కొన్నారు.
సయ్యద్ 2019లో కూడా ఇదేవిధంగా నిరాధారమైన ప్రచారం చేశాడని, ఈసీ ఆదేశాల మేరకు అతనిపై అప్పట్లో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. సయ్యద్ విదేశాల్లో ఉంటూ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు. ఈవీఎంలను ఏదైనా నెట్వర్క్తో కనెక్ట్ చేయడం సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది.