హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ) : ఇండిపెండెంట్ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్ (ది వైర్ ), అభిసార్ శర్మలను వేధించే ఉద్దేశంతో గువాహటిలో బీజేపీ కార్యకర్త ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా తెలిపారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. పాలక పక్షాలు, వాటి విధానాల పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే గొంతులను నొకేందుకు ప్రజాస్వామ్య చట్ట పుస్తకాలలో స్థానం లేని నిరంకుశ నిబంధనలను ప్రయోగించడం అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రమాదకరమైన విధానంగా మారిందని ఆయన విమర్శించారు.