పుణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్(Puja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్‌పై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను పిస్తోల్‌తో బెదిరించిన ఘటనలో మనోరమపై కేసు బుక్కైంది. మనోరమాతో పాటు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్, మరో అయిదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 323, 504, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. శుక్రవారం రాత్రి పౌడ పోలీసు స్టేషన్లో ఆ కేసు నమోదు అయ్యింది. ఆర్మ్స్ యాక్టు కింద కూడా కేసు పెట్టారు.
కొంత మంది రైతుల్ని గన్‌తో బెదరిస్తున్నట్లు మనోరమ ఖేద్కర్‌కు చెందిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనోరమ వద్ద ఉన్న గన్‌కు లైసెన్సు ఉందా లేదా అన్న కోణంలో విచారణ చేపట్టనున్నట్లు పుణె పోలీసులు వెల్లడించారు. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ప్రభుత్వ ఆఫీసర్‌గా చేశారు. అయితే పుణె తహిసిల్‌లోని ధాడ్‌వాలీ గ్రామంలో ఆయన భూమిని కొన్నారు. అయితే పక్కన ఉన్న భూమిని కూడా ఆ కుటుంబం కబ్జా చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కొనుగోలు చేసిన భూమి వద్ద .. పక్కవారితో మనోరమా ఖేద్కర్ గొడవకు దిగారు. సెక్యూర్టీ గార్డులతో అక్కడకు ఆమె వెళ్లారు. ఆ బెదిరింపు ఘటనకు చెందిన రెండు నిమిషాల వీడియో వైరల్ అయ్యింది. తన పిస్తోల్ పట్టుకున్న మనోరమ రైతులపై అరుస్తూ కనిపించింది. మనోరమ తన భూమిని అక్రమంగా లాగేసుకుంటోందని కుల్దీప్ పసల్కర్ అనే రైతు పేర్కొన్నాడు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదాల్లో ఇరుక్కోవడంతో.. ఇప్పుడు ఆమె తల్లి వీడియోపై మరింత ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. పూజా తన స్వంత ఆడీ కారుకు బీకన్ పెట్టుకుని తిరుగుతోంది. అనేక సార్లు ఆమె సిగ్నల్ జంప్ చేసింది. పుణె ట్రాఫిక్ పోలీసులు ఆమెకు 27 వేల జరిమానా వేశారు.
Watch Manorama Khedkar the mother of IAS officer #PoojaKhedkar, accompanied by bouncers threatening farmers while brandishing a pistol.
There are allegations that her husband, Dilip Khedkar, acquired crores while working a government job.
In the process of purchasing land he… pic.twitter.com/Vp73oMlNHC
— Be the Change👊🏻 aka Jennifer Fernandes (@nandtara) July 12, 2024