భార్యకు ఆర్థిక స్థోమతుంటే భరణం ఇవ్వక్కర్లేదు
ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి, సొంతంగా సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామికి శాశ్వత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద భరణం అనేది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించిన చర్య అని, ఆర్థికంగా బలవంతులైన వ్యక్తులు ధనవంతులుగా మారేందుకు సాధనం కాదని కోర్టు తేల్చి చెప్పింది.
- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ : ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి, సొంతంగా సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామికి శాశ్వత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద భరణం అనేది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించిన చర్య అని, ఆర్థికంగా బలవంతులైన వ్యక్తులు ధనవంతులుగా మారేందుకు సాధనం కాదని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పుచెప్పింది.
భరణం కోరేవారు ఆర్థికసాయం అవసరం తమకు నిజంగా ఉందని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను, భార్యకు శాశ్వత భరణాన్ని నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో భర్త వృత్తిరీత్యా న్యాయవాది కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ గ్రూప్-ఎ అధికారిగా పనిచేస్తున్నారు. కేవలం 14 నెలలపాటు కలిసి ఉన్న ఈ దంపతులు విడిపోయేందుకు భార్య ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు కోర్టు గుర్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

