కుమారుడి మృతితో మనస్తాపం.. తల్లి ఆత్మహత్య
కన్న కొడుకు మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎల్కారం గ్రామానికి చెందిన మొదల పావని (22) భర్త రవితో కలిసి...
చౌటుప్పల్, నవంబర్ 19 : కన్న కొడుకు మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఎల్కారం గ్రామానికి చెందిన మొదల పావని (22) భర్త రవితో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్‌కు వచ్చి హనుమాన్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 18 నెలల కుమారుడు హేమంత్. గత నెల ఆగస్టు 9న బాలుడు ఆడుకుంటూ నాఫ్తాలిన్ గోళీలు మింగాడు. చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుండి కుమారుడి మరణాన్ని తట్టుకోలేక పావని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పావని భర్త రవి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లగా చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పావని తల్లి రావుల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడి మృతితో మనస్తాపం.. తల్లి ఆత్మహత్య
EPFO | పార్షియల్ విత్‌డ్రాయల్ రూల్స్‌ను సవరించిన ఈపీఎఫ్‌వో.. కనీస నిల్వ మొత్తం 10 శాతానికి తగ్గింపు..!
‘వ్యక్తిగత వ్యాపారాలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలి’
Kondagattu | కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్
అడ్డుకట్ట వేయకపోతే సింగరేణి కాలనీల్లో పచ్చదనం కనుమరుగు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

