పాట్నా: బీహార్(Bihar SIR) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఓటర్లకు చెందిన తుది జాబితాను ఇవాళ రిలీజ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో వెల్లువెత్తిన అభ్యర్థనలకు స్పందించిన ఎన్నికల సంఘం, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇవాళ రాష్ట్ర ఓటర్లకు చెందిన తుది జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు చెందిన తేదీలను వెల్లడించే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో.. బీహార్‌కు చెందిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఓటర్ల జాబితా గురించి ఫేస్బుక్ అకౌంట్లో ప్రకటన చేశారు. voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ప్రజలు తమ పేర్లను పరిశీలించుకోవచ్చు అని సోషల్ మీడియా పోస్టులో ఎన్నికల సంఘం అధికారి పేర్కొన్నారు.
Special Intensive Revision of Electoral Rolls in #Bihar Successfully Completed#ECI thanks all the Electors of Bihar for making this exercise a Grand Success
Final Electoral Roll published today; includes nearly 7.42 crore electors
Read in detail: https://t.co/DQEaXv9njk pic.twitter.com/trQtBGKkVl
— Election Commission of India (@ECISVEEP) September 30, 2025
బీహార్ ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం భారీగా ఓట్లను తొలగించినట్లు విపక్షాలు విమర్శించి విషయం తెలిసిందే. సుమారు 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు సిర్ ప్రక్రియ ప్రారంభంలో ఈసీ పేర్కొన్నది. సిర్ విధానాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఓటర్లకు చెందిన కొత్త లిస్టును రిలీజ్ చేసింది. బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. బీహార్‌లో సిర్ ప్రక్రియ విజయవంతమైనట్లు ఈసీ అధికారులు ప్రకటించారు. తుది జాబితాకు చెందిన సమాచారం డిజిటల్ రూపంలో కూడా రాజకీయ పార్టీల వద్ద అందుబాటులో ఉంటుందని ఈసీ చెప్పింది.
రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ తన ప్రకటనలో పేర్కొన్నది. పాట్నా నుంచి కొత్తగా 1.63 లక్షల ఓటర్లు జత కలిసినట్లు తెలుస్తోంది.