Filmmaker Sundar : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు (Filmmaker) సీ సుందర్ (C Sunder) తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఆయన మధురై సెంట్రల్ (Madhurai centrel) నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling) జరగనుంది.
ఈ ఎన్నికల్లో దర్శకుడు సుందర్ అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. విషయాన్ని పీఎన్కే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం ప్రకటించారు. సుందర్ అన్నాడీఎంకేకు పార్టీకి చెందిన రెండాకుల గుర్తుతో పోటీ చేస్తారని ఆయన తెలిపారు. కాగా సుందర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ఆయన భార్య, బీజీపీ సీనియర్ నాయకురాలు కుష్బూ సుందర్ స్పందించారు.
సుందర్ ప్రజల మనిషిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని కుష్బూ అన్నారు. మూడు దశాబ్దాలుగా తన సినిమాలను ఆదరించిన తమిళ ప్రజలకు సుందర్ సేవ చేయాలని భావిస్తున్నారని చెప్పారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిల మధ్యనే ప్రధాన పోటీ జరుగనుంది.