న్యూఢిల్లీ : భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం బుధవారం గుజరాత్లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ గల్లంతయ్యారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలను ఆర్పారు. మరో పైలట్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.