న్యూఢిల్లీ: బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్.. తాజాగా ఎన్డీయే పక్షాన చేరారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ అర్లేకర్ వెంటనే ఆమోదించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని నితీశ్ చెప్పారు.
ఈ నేపథ్యంలో లాలూ కుమార్తె రోహిణి.. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఊపిరి ఉన్నంత వరకు మత తత్వ శక్తులతో తమ పోరాటం కొనసాగుతుంది’ అని హిందీలో పోస్ట్ చేశారు.
जब तक साँस बाकी है
सांप्रदायिक ताकतों के खिलाफ हमारी लड़ाई जारी है..— Rohini Acharya (@RohiniAcharya2) January 28, 2024