న్యూఢిల్లీ: మనం బస్సులోనో, రైలు, ఆటోలోనే సీటు కోసం గొడవ పెట్టుకోవడం చూశాం. ఒకరినొకరు తన్నుకోవడం, కిటికీ సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకోవడమూ చూశాం. మరి విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూసుండం.. అయితే ఇక్కడ గొడవ జరిగింది సీటు కోసం కాదనుకోండి. అసలు లొల్లి ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. ఓ వ్యక్తి అదేనండీ విమాన ప్రయాణికుడు.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి అదికాస్త చేయి చేసుకోవడం వరకు వెళ్లింది..
థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానం బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వస్తున్నది. విమానం గాల్లో ఉండగా.. ఓ అద్దాలు పెట్టుకున్న వ్యక్తి.. నల్ల అంగి తొడుకున్న మరో యువకుడితో గొడవకు దిగాడు. ఇద్దరు వాదులాడుకుంటున్నారు. ఇంతలో అద్దాలతని దోస్తులు అతనికి తోడయ్యారు. అంతా కలిసి నల్లంగి తొడుకున్న వ్యక్తిని కొట్టారు. వారిని ఆపడానికి విమాన సిబ్బంది ప్రయత్నించిన్నప్పటికీ.. గొడవ సద్దుమణగలేదు. ఇంత జరుగుతున్నా తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. మరికొందరు దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది తెగ షేరింగ్ అవుతున్నది. అయితే ఈ ఘటనపై థాయ్ ఎయిర్వేస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Not many smiles on this @ThaiSmileAirway flight at all !
On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone.
Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l— VT-VLO (@Vinamralongani) December 28, 2022