Kurkure | రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన కుర్కురే.. 10 మందికి గాయాలు.. అరెస్ట్ భయంతో పరార్
Kurkure | రూ.5 రూపాయల కుర్కురే (Kurkure) కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది (Fight between two families).
Kurkure | రూ.5 రూపాయల కుర్కురే (Kurkure) కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది (Fight between two families). ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో గాయపడగా.. అరెస్ట్ భయంతో కొందరు గ్రామం నుంచి పరారయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా హొన్నెబాగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఈ గొడవ రెండు రోజుల వరకూ కొనసాగింది. గ్రామానికి చెందిన అతీఫ్ ఉల్లా కుటుంబం స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటుంది. వారి దుకాణానికి దగ్గర్లోనే రోడ్డు పక్కన సద్దాం కుటుంబం హోటల్ నడుపుతుంటారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సద్దాం కుటుంబానికి చెందిన చిన్న పిల్లలు.. అతీఫ్ దుకాణంలో కుర్కురే ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే, గడువు దాటిన కుర్కురే అమ్మారంటూ సద్దాం కుటుంబం అతీఫ్ కుటుంబంతో గొడవకు దిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
ఇరు వర్గాలు కొట్టుకునే వరకూ వెళ్లారు. రెండు వాహనాల్లో వచ్చిన సుమారు 30 మంది దుకాణంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ గొడవలో సుమారు 10 మంది గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు చన్నగిరి పోలీస్ స్టేషన్లో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అరెస్ట్ భయంతో సుమారు 25 మంది వరకూ గ్రామం విడిచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Himachal Pradesh | హిమాచల్‌పై మంచు దుప్పటి.. జాతీయ రహదారులు సహా 170 రోడ్లు మూసివేత..!
Heavy Snow | మనాలీలో భారీగా హిమపాతం.. చిక్కుకుపోయిన 1,000కి పైగా వాహనాలు.. VIDEOS
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

