నాసిక్ : మహారాష్ట్రలో రైలు పట్టాలు తప్పింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్ప్రెస్ కొన్ని కోచ్లు ఆదివారం నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన తర్వాత యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, మెడికల్ వ్యాన్ సంఘటనా స్థలానికి బయలుదేరిందని సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.