భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బాంధావ్గ్రహ్ టైగర్ రిజర్వ్‌లో ఓ ఆడ పులి పిల్ల మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. చనిపోయిన పులి పిల్ల తల, కడుపు, చెవులపై బలమైన గాయాలున్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.
అయితే 8 ఏండ్ల వయసున్న మగ పులి పిల్ల దాడి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం అనంతరం పులి పిల్ల మృతకళేబరాన్ని డిస్పోజ్ చేస్తామన్నారు. 2018 పులుల గణన ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 526 పులులు ఉన్నట్లు గుర్తించారు.