చండీగఢ్: వృద్ధుడైన మామ పట్ల బీజేపీ నాయకురాలు అమర్యాదగా ప్రవర్తించింది. ఎవరితోనో వీడియో కాల్లో మాట్లాడిన ఆమె టీ చేసుకుంటున్న అతడ్ని తోసేసింది. ఆ వృద్ధుడు ప్రతిఘటించడంతో ఆమె ఫోన్ కిందపడింది. ఆ తర్వాత కూడా మామను ఆమె వేధించింది. (Female BJP Leader Physically Abussed Father-In-Law) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ తారా బాయి అలియాస్ మార్గరెట్ డిసౌజా, 81 ఏళ్ల మామ జన్ విజయ్ సింగ్ పట్ల అమర్యాదగా ప్రవర్తించింది. వీడియో కాల్లో మాట్లాడుతున్న ఆమె, కిచెన్‌లో టీ చేసుకుంటున్న వృద్ధుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నది. ఈ సందర్భంగా ఆయనను తోసేయడంతో ప్రతిఘటించాడు. దీంతో ఆమె మొబైల్ ఫోన్ కిందపడింది.
కాగా, కింద పడిన మొబైల్ ఫోన్ తీసుకున్న తారా బాయి ఆ తర్వాత పొయ్యిపై ఉన్న పాత్రలను పక్కకు తీసేసింది. ఫోన్లో ఎరితోనో మాట్లాడిన ఆమె రెండు సార్లు వంటగదిలోకి వచ్చింది. తన తీరుతో మామను వేధించింది. పట్టించుకోని ఆ వృద్ధుడు తనకు కావాల్సిన టీ తయారు చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు.
మరోవైపు కిచెన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వృద్ధుడైన మామ పట్ల బీజేపీ నాయకురాలి అమర్యాద ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వైఖరిని కొందరు ఖండించారు. మరికొందరు బీజేపీకి ఫిర్యాదు చేశారు. ఆ మహిళా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
In a disturbing video surfacing from #Patiala, #Punjab, Tara Bai, also known as Alias Margret DSouza, the #BJP Block President from Patiala, is seen allegedly mistreating her 81-year-old father-in-law, Mr. Jan Vijay Singh.
In the footage, #TaraBai appears to be engaged in a… pic.twitter.com/GuVepIZcFT
— Hate Detector 🔍 (@HateDetectors) October 30, 2024