పాట్నా: తాగుబోతు భర్త వేధింపులపై అతడి భార్య విసిగిపోయింది. లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకున్నది. చివరకు అతడితో కలిసి పారిపోయి పెళ్లాడింది. (Woman Elopes With Loan Recovery Agent) ఇది తెలుసుకుని ఆ గ్రామస్తులు షాక్ అయ్యారు. బీహార్‌లోని జముయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ రుణాల రికవరీ కోసం పలు గ్రామాలను సందర్శించేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట కర్మ టాండ్ గ్రామానికి చెందిన ఇందిరా కుమారిని అతడు కలిశాడు. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు.
కాగా, వారిద్దరి మధ్య సంబంధం మరింతగా బలపడింది. దీంతో ఇందిర తన భర్తను వదిలి పవన్‌తో వెళ్లిపోయింది. ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట వివాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
మరోవైపు తనకు పెళ్లై ఏడాదిన్నర అయ్యిందని ఇందిర తెలిపింది. అయితే తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, శారీరకంగా వేధించేవాడని ఆమె ఆరోపించింది. తాగుబోతు భర్తతో విసిపోవడంతోపాటు అతడి హింసను భరించలేక పరిచమైన పవన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తన జీవితాన్ని అతడితో గడుపుతానని చెప్పగా పవన్ ఒప్పుకోవడంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. కాగా, కొందరు రికార్డ్ చేసిన వారి పెళ్లి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जमुई -शराबी पति से परेशान महिला को लोन देने वाले बैंक कर्मी से हो गया प्यार। जिसके बाद वो पति को छोड़कर प्रेमी के साथ फरार हो गयी। मंदिर में जाकर दोनों ने रचा ली शादी.#Bihar #BiharNews #Jamui pic.twitter.com/HauQ2dRdLF
— FirstBiharJharkhand (@firstbiharnews) February 12, 2025