న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: బీజేపీకి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొన్నదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో ఆప్‌కు లభిస్తున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేకపోతున్నదని, అందుకే ఆప్ మంత్రులపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు. ఆదివారం ఆప్ ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సులో కేజ్రీవాల్ ప్రసంగించారు. గుజరాత్లో ఆప్ వార్తలు ప్రసారం చేయరాదని ప్రధాని సలహాదారు హిరేన్ జోషీయే మీడియా సంస్థల యజమానులను బెదిరించారని ఆరోపించారు.