ముంబై, (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర, అకోలా జిల్లాలోని తెల్హారా తాలూకాలో ఒక ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. అడ్సుల్ అనే గ్రామంలో 12 ఏండ్ల బాలికపై ఆమె తండ్రి, బాబాయి, సమీపంలో నివసించే ఓ వృద్ధుడు ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిసింది.
వారి ఆగడాలు భరించ లేక బాధితురాలు ఇటీవల తన పాఠశాల ప్రిన్సిపాల్‌కు జరిగిన విషయాలను మొత్తం వివరించడంతో ఈ దారుణం బయటపడింది. ప్రిన్సిపాల్ గణేష్ థాకరే చైల్డ్ లైన్ బృందం సాయంతో వెంటనే తెల్హారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి తండ్రి, తాత గజానన్ భోమ్ను అరెస్టు చేశారు.